అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీలో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఫలితాలు వెలువడడానికి ఒక్కరోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఇతర నేతలు ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇస్తామన్నారని ఆఫర్ చేశారని ఆరోపణలు చేశారు. అయితే ఆప్ నేతల వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అంతేగాకుండా దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన ఆయన ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారుల బృందం శుక్రవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Advertisement