అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీలో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఫలితాలు వెలువడడానికి ఒక్కరోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఇతర నేతలు​ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇస్తామన్నారని ఆఫర్ చేశారని ఆరోపణలు చేశారు. అయితే ఆప్​ నేతల వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అంతేగాకుండా దీనిపై లెఫ్టినెంట్​ గవర్నర్​ వీకే సక్సేనాకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన ఆయన ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారుల బృందం శుక్రవారం కేజ్రీవాల్​ నివాసానికి వెళ్లింది. దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  COURT | వివాదాస్పద వ్యాఖ్యల కేసు..రాహుల్​ గాంధీకి న్యాయస్థానం నోటీసులు