అక్షరటుడే, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ లో భారీగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈనెల 13న జరిగిన తొలి విడతలోనూ భారీగానే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 43చోట్ల పోలింగ్ కాగా.. బుధవారం 38 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఇక మహారాష్ట్ర లోని చాలా చోట్ల ఓటర్లు క్యూలో ఉండడడంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. ముంబైలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ స్థానాలు మొత్తం 288 ఉన్నాయి. మహాయుతి కూటమిలో బీజేపీ 149, శివసేన 81, అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన(యూబీటీ) 95, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఎస్పీ, ఎంఐఎం సహా చిన్న పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. బీఎస్పీ 237, ఎంఐఎం 17 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి.