అక్షరటుడే, వెబ్‌డెస్క్: Polycet | రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. పదో తరగతి తర్వాత ఇంటర్‌తో పాటు ఎంతోమంది పాలిటెక్నిక్ కాలేజీలో చేరుతుంటారు. వారి కోసం సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్-2025) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రూ.100 ఫైన్‌తో ఏప్రిల్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుంతో ఏప్రిల్ 23 వరకు అవకాశం ఉంది. మే 13న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. ఈ కింది వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
https://polycet.sbtet.telangana.gov.in/#!/index