అక్షరటుడే, వెబ్​డెస్క్: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని(Posani Krishna Murali) పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదైంది. దీంతో బుధవారం రాత్రి హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయనను కోర్టుకు తరలించనున్నారు.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా కేసులు

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​, మంత్రి నారా లోకేశ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదులు చేశారు. వాటిపై పలు చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

ఖండించిన అంబటి

పోసాని కృష్ణమురళి అరెస్టును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఖండించారు. ఆయన ఆరోగ్యం బాగా లేదని చెబుతున్నా పోలీసులు అరెస్ట్​ చేసి తీసుకు వెళ్లడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వ వైసీపీ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Advertisement