Posani | జైలు నుంచి విడుదలైన పోసాని

Posani | జైలు నుంచి విడుదలైన పోసాని
Posani | జైలు నుంచి విడుదలైన పోసాని
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Posani | సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ(YCP) హయాంలో చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh)​, పవన్​ కల్యాణ్(Pavan Kalyan)​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

గత నెల 26న అన్నమయ్య జిల్లా ఓబులావారిపల్లె పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే ఆయనపై ఐదు కేసులు నమోదు చేశారు. ఒక కేసులో బెయిల్​ రాగానే మరో కేసు పెట్టడంతో దాదాపు నెల రోజులు పోసాని జైలులోనే ఉండిపోయారు. ఎట్టకేలకు అన్ని కేసుల్లో బెయిల్​ రావడంతో శనివారం ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement