తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలి

0

అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: తపాల బీమాను సద్వినియోగం చేసుకోవాలని విజయ డెయిరీ అడ్లూరు ఎల్లారెడ్డి ప్రతినిధులు కోరారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. బుధవారం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ రైతులకు ఇన్సూరెన్స్ చేయించారు. కార్యక్రమంలో డెయిరీ అధ్యక్షుడు దుబ్బాక నర్సారెడ్డి, పోస్టల్ సిబ్బంది శంకర్‌రావు, శ్రీనివాస్, బాలయ్య, శ్రీనివాస్ రెడ్డి, సూపర్‌వైజర్ రమేష్, రైతులు పైడి చిన్నయ్య, వెంకట్ రాములు, తెలుగు సురేష్, పయ్యావుల నరేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.