అక్షరటుడే, కోటగిరి: విధులకు ఆటంకం కలిగించిన వారిపై పోతంగల్ తహసీల్దార్ మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొతంగల్ మండలం నుంచి అక్రమ ఇసుక రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మండల కేంద్రంలో అక్రమ రవాణా చేస్తున్న ఓ టిప్పర్‌ను పట్టుకుంది. అక్కడే ఉన్న ఇసుక అక్రమార్కుడు వారిని అడ్డుకున్నాడు. పట్టుకున్న టిప్పర్‌ను అక్కడి నుంచి పంపివేశాడు. అయితే సిబ్బంది అక్కడ ఉన్న జేసీబీని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
విధుల అడ్డగింత.. పోలీసులకు ఫిర్యాదు
Advertisement
Advertisement