అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రగతి శీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ), పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగి పది రోజులు అవుతున్నా కేంద్ర, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.