అక్షరటుడే, ఆర్మూర్: వర్షాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశం ఆమె మాట్లాడారు. పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, లక్ష్మీ, పద్మ, మమత, సునీత పాల్గొన్నారు.