అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో మూడు రోజుల పాటు పలు వేళల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు ఏడీఈ టౌన్-1 చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 8 ఎంవీఏ స్థాయిని 12.5 ఎంవీఏకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుకవ్రారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.