అక్షరటుడే, ఇందూరు:Power Cut | నగరంలో బుధవారం విద్యుత్ సరఫరా(power supply)లో అంతరాయం ఉంటుందని టౌన్ ఏడీఈ చంద్రశేఖర్(ADE Chandrashekhar) పేర్కొన్నారు.
వినాయక్‌నగర్ సబ్‌స్టేషన్(Vinayaknagar substation) పరిధిలోని పూలాంగ్ ఫీడర్లో చెట్లకొమ్మలను తొలగించేందుకు గాను విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. పూలాంగ్ వంశీ ఇంటర్నేషనల్, కాకతీయ కళాశాల, దేవీటాకీస్, నిఖిల్ సాయి, వేణుమాల్, రైతుబజార్, పాటిగల్లి ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.