heavy rains | విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి: సీఎం రేవంత్​

heavy rains | విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి: సీఎం రేవంత్​
heavy rains | విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి: సీఎం రేవంత్​

అక్షరటుడే, హైదరాబాద్: heavy rains: అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షంతో మహా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement

హైదరాబాద్​ నగరం(Hyderabad city)లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary of the State Government) శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య(traffic problems) తలెత్తకుండా, విద్యుత్తు అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ(GHMC), పోలీసు(Police), హైడ్రా(Hydra) విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Cyclone Warning | బిగ్​ అలెర్ట్.. తీవ్రమైన తుఫాను హెచ్చరిక

విద్యుత్తు సరఫరా(power supply) నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించాలన్నారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని స్పష్టం చేశారు.

పలు జిల్లాల్లోనూ వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Advertisement