అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జీవో నంబర్‌ 99పై స్టే విధించాలని, హైడ్రా కూల్చివేతలను ఆపేయాలని కేఏ పాల్‌ హైకోర్టులో వాదించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని కేఏ పాల్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. ఇప్పటికప్పుడు కూల్చివేతల్ని ఆపలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, ప్రభుత్వం వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.