అక్షరటుడే, వెబ్‌డెస్క్ : నన్ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. తానువేసిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలని లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. తనను బెదిరించినవారే పోయారు తప్ప తనకేమీ కాలేదని వ్యాఖ్యానించారు. గ్రూప్-1 విద్యార్థులకు తాను మద్దతు తెలుపుతున్నాన తెలిపారు. అభ్యర్థుల కోసం పరీక్షలను రెండునెలల పాటు వాయిదా వేస్తే తప్పేమిటని తెలంగాణ సర్కారును ఆయన ప్రశ్నించారు.