Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు” అని విమర్శించారు. రాష్ట్రపతులుగా పనిచేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారన్నారు. కానీ కేఆర్‌ నారాయణన్‌ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశంలో సంతాపం తెలియజేశారని గుర్తుచేశారు. అప్పటి సంతాప సందేశాన్ని ప్రణబ్‌ ముఖర్జీనే రాశారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.

Advertisement