అక్షరటుడే, జుక్కల్: ఇటీవల అర్మేనియాలో జరిగిన అంతర్జాతీయ చెస్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బిచ్కుంద మండలం తక్కడపల్లికి చెందిన ప్రతిభ కాంస్య పతకం కైవసం చేసుకుంది. అంతేగాక, ఈసారి తన వెయిట్ కేటగిరీ తొలగించడంతో, ఏడు కిలోలు అధిక బరువు కేటగిరి ప్రత్యర్థులతో తలపడి పతకం సాధించడంపై వివిధ దేశాల క్రీడాకారులు ప్రతిభను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ ఛాంపియన్ షిప్ కి స్పాన్సర్ చేసిన పోచారం సోని రెడ్డి, భాస్కర్ రెడ్డికి క్రీడాకారిణి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.