అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ గర్భిణి ఆదివారం 108 అంబులెన్స్ లో ప్రసవించింది. బీసీ కాలనీకి చెందిన గర్భిణి గంగోత్రికి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108కు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే చేరుకున్న సిబ్బంది అంబులెన్స్ లో కోటగిరి సీహెచ్ సీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో పైలట్ వినోద్, ఈఎన్టీ రవి మహిళకు ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించగా, తల్లి పాప క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.