అక్షరటుడే, వెబ్‌డెస్క్ : సైబర్ నేరాలు, డీప్‌ఫేక్, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మానవజాతికి కొత్తముప్పుగా పరిణమించాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సవాళ్లు పొంచి ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్నారు. వీటి నివారణకు ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని పేర్కొన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు.