అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌: పశ్చిమ బెంగాల్‌లో వైద్యురాలి దారుణ హత్య ఘటనతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైందని టీపీహెచ్‌డీఏ(తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌) జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సంతోష్‌ అన్నారు. ఈ క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఇందల్వాయి ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ఘటన దేశంలో వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వైద్యులు కనీస భద్రతలేని పరిస్థితుల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.