fine rice | ఉచిత సన్న బియ్యం పంపిణీ ఎఫెక్ట్.. బయటి మార్కెట్​లో దిగొస్తున్న ధరలు

fine rice | ఉచిత సన్న బియ్యం పంపిణీ ఎఫెక్ట్.. బయటి మార్కెట్​లో దిగొస్తున్న ధరలు
fine rice | ఉచిత సన్న బియ్యం పంపిణీ ఎఫెక్ట్.. బయటి మార్కెట్​లో దిగొస్తున్న ధరలు

అక్షరటుడే, హైదరాబాద్: fine rice : సన్నబియ్యం sanna biyyam పంపిణీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెల్ల రేషన్ కార్డుదారులకు (white ration card holders) ఉచితంగా అందిస్తోంది. దీంతో బయట మార్కెట్లో సన్న బియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Advertisement

గత నెల వరకు నాణ్యమైన సన్న బియ్యం ధరలు క్వింటాకు రూ.6,500 నుంచి రూ.5,800 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.5,000 లోపే పలుకుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్న రకం వరి సాగును ప్రోత్సహిస్తోంది. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు(millers) పోటీపడి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నారు. సరఫరా పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గిస్తున్నారు.

ధాన్యానికి కేంద్ర సర్కారు(central government) ‘ఏ’ గ్రేడ్‌నకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌(bonus for paddy) ఇస్తోంది. ఈ బోనస్​తో కలిపి రూ.2,820కి రైతన్నల నుంచి కొనుగోలు చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  TG TET | నేటి నుంచే టెట్​ దరఖాస్తుల స్వీకరణ

2024 ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌ నుంచి ఈ బోనస్​ విధానాన్ని తెలంగాణ సర్కారు(Telangana government) అమలు చేస్తోంది. బోనస్‌ ప్రకటనతో రాష్ట్రంలో 2023 వానాకాలం పంటతో పోల్చితే 2024 వానాకాలం(rainy season) సాగులో సన్నాల పంట 50 శాతానికిపైగా పెరగడం గమనార్హం.

2023-24 సంవత్సరానికి సంబంధించి వానాకాలం సాగు సమయంలో మొత్తం 144.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావడం గమనార్హం. 2024-25కి సంబంధించి ధాన్యం దిగుబడి 145.56 లక్షల టన్నులు వచ్చింది. ఇందులో సన్న రకమే 88.39 లక్షల టన్నులు వచ్చింది. దొడ్డు రకం 57.17 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. సన్నరకం దిగుబడి ఎక్కువ రావడంతో మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుతున్నాయి.

Advertisement