మోదీకి మద్దతుగా బైక్ యాత్ర

0

అక్షరటుడే, ఇందూరు: దేశం కోసం ధర్మం కోసం ఔర్ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ అనే నినాదంతో తమిళనాడుకు చెందిన మాత రాజ్యలక్ష్మి మందాజీ ప్రారంభించిన బుల్లెట్‌ యాత్ర శుక్రవారం ఇందూరుకు చేరుకుంది. ఆమెకు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మద్దతుగా నగరంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 65 రోజులు, 21 వేల కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. దేశమంతా మోదీ రావాలని ఆకాంక్షిస్తున్నారని, ఎక్కడికెళ్లినా పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యలక్ష్మి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉంటూ, గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. మోదీ గెలుపు కోసం యాత్ర చేపట్టడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సుప్రీంకోర్టు న్యాయవాది ఆనంద్‌ బట్టి గిరి, రోషన్‌ లాల్‌ బోరా, అల్లాడి రాజు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.