అక్షరటుడే, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి 4 రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. నేడు, రేపు ఫ్రాన్స్‌లో మోడీ టూర్ ఉంటుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొననున్నారు. థర్మో న్యూక్లియర్ రియాక్టర్‌ను సందర్శిస్తారు. ఫ్రాన్స్ పర్యటన తర్వాత ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు. ఇటీవల ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపుతున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
Advertisement
Advertisement