అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్లోబల్ యానిమేషన్ పవర్‌హౌస్‌గా భారత్‌ను మార్చేందుకు సంకల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 28న వరల్డ్ యానిమేషన్ డే జరుపుకోనున్నామని పేర్కొన్నారు. మన్‌కీబాత్ 115వ ఎపిసోడ్‌లో ఈరోజు ఆయన ప్రసంగించారు. దీపావళి పండుగకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆత్మనిర్భర్‌తో భారత్ ప్రతిరంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొనారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ స్కాంలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఆందోళన వద్దని సూచించారు. డిజిటల్ మోసాలకు సంబంధించిన వీడియోను మోదీ ప్లే చేసి చూపించారు. ఏ దర్యాప్తు సంస్థలు ఫోన్లు, వీడియోకాల్స్ ద్వారా మిమల్ని సంప్రదించవన్నారు. నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తే 1930 నంబర్‌కు లేదా క్రైం పోర్టల్ సాయంతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.