అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఈరోజు రష్యా వెళ్లారు. కజాన్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ మోదీని జూలైలో కలుసుకున్నా..అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు గుర్తుందన్నారు. చాలా సార్లు టెలిఫోన్‌లో మాట్లాడామన్నారు. కజాన్‌కు రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పుతిన్ మీస్నేహానికి, అతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. బ్రిక్స్ సమ్మిట్ కోసం కజాన్ నగరాన్ని సందర్శించే అవకాశం లభించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కజాన్ నగరం మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.