అక్షరటుడే, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలంతా చివరి వరకూ అద్భుతంగా పని చేశారని అభినందించారు. బీజేపీకి ఓటువేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో విజయం సాధించిన ఇండియా కూటమికి అభినందనలు తెలిపారు. హర్యానాలో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్ అని మరో ట్వీట్ చేశారు.