Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ (SVAMITVA) పథకం కింద శనివారం వర్చువల్‌ విధానంలో మోదీ దాదాపు 65 లక్షల మందికి ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈపథకం కింద దేశంలో 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత పాంత్రాల్లోని 230 జిల్లాలోని లబ్ధిదారులు ఈఆస్తికార్డులు అందుకున్నారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అనంతరం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన లబ్ధిదారులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. కేంద్రం ఈపథకాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. ఈకార్యక్రమంలో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Delimitation | డీలిమిటేషన్​ అంటే ఏమిటి.. ఆందోళనలు ఎందుకంటే..