అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో రెండు దేశాలు పురస్కారాలు ప్రకటించాయి. గయానా, బార్బడోస్ దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాలను మోదీకి ప్రదానం చేయనున్నాయి. గయానా జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’, బార్బడోస్ ప్రతిష్టాత్మకమైన గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ను అందించనున్నాయి. డొమినికా దేశం కొద్దిరోజుల క్రితం మోదీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా లభించిన పురస్కారాల సంఖ్య 19కి చేరింది.