అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో మరోసారి పర్యటించనున్నారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరి, 16న జగిత్యాల, 18న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. వారం కిందటే ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోదీ వరుస పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.