అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్ బీభత్సం అంతా ఇంతా కాదు.. ప్రకృతి ప్రకోపం కారణంగా వందలాది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగి పడడంతో పలు గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో ప్రధాని మోదీ శనివారం వయనాడ్‌లో పరిశీలించారు. ప్రకృతి విలయం జరిగిన తీరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఉదయం కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేరళ గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వయనాడ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ వివరాలు తెలుసుకున్నారు.