prisoners test HIV positive | 15 మంది ఖైదీలకు హెచ్​ఐవీ పాజిటివ్​..జిల్లా జైలులో షాకింగ్​ విషయం వెలుగులోకి

prisoners test HIV positive | 15 మంది ఖైదీలకు హెచ్​ఐవీ పాజిటివ్​..జిల్లా జైలులో షాకింగ్​ విషయం వెలుగులోకి
prisoners test HIV positive | 15 మంది ఖైదీలకు హెచ్​ఐవీ పాజిటివ్​..జిల్లా జైలులో షాకింగ్​ విషయం వెలుగులోకి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: prisoners test HIV positive : ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని హరిద్వార్ జిల్లా జైలు(Haridwar district jail)లో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. జైలులో ఉన్న ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేయగా.. 15 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. ఖైదీలకు ఎయిడ్స్ సోకడంపై అధికారులు షాక్​ అయ్యారు.

Advertisement

దీనిపై హరిద్వార్ సీనియర్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య(Haridwar Senior Jail Superintendent Manoj Kumar Arya) మాట్లాడుతూ.. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా జైలులో ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా జైలులోని ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహించామని, అందులో 15 మందికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు వివరించారు. ఈ మేరకు వారందరినీ ఒకే బ్యారక్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Landslides | ఉత్తరాఖండ్​లో కుండపోత.. విరిగిపడిన కొండచరియలు

prisoners test HIV positive : గతంలో 16 మందికి..

ప్రస్తుతం హరిద్వార్ జిల్లా జైలులో 1,100 మంది ఖైదీలు ఉన్నారు. కాగా, 2017లో నిర్వహించిన వైద్య పరీక్షలో 16 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య తెలిపారు. 2021 నుంచి 2024 వరకు హరిద్వార్ జిల్లాలో 916 మంది హెచ్ఐవీ పాజిటివ్ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాల(Government statistics) ద్వారా తెలుస్తోంది.

Advertisement