అక్షరటుడే, ఇందూరు: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు రాకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో మారయ్యగౌడ్, కో-ఆర్డినేటర్ నరాల సుధాకర్, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, ఆయా కళాశాలల యజమానులు పాల్గొన్నారు.