అక్షరటుడే, వెబ్‌డెస్క్: నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నగర శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ కు చెందిన విద్యార్థులను సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి చేర్చేక్రమంలో గంగాస్థాన్ ఫేజ్–2 వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా బురదలో దిగబడింది. దీంతో ఒక పక్కకు ఒరగగా.. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపేశారు. విద్యార్థులను సురక్షితంగా కిందకి దింపి ఇతర వాహనాల్లో తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ మార్గంలో రోడ్డు బాగాలేదని, ఫలితంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు చెబుతున్నారు.