అక్షరటుడే ఇందూరు: జిల్లాలో అనుమతులు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించొద్దని డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా పలు పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. నిషిత ఇంటర్నేషనల్ స్కూల్, ముబారక్ నగర్ లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలకు విద్యా శాఖ నుంచి ఇప్పటివరకు అనుమతులు లేవని పేర్కొన్నారు. అనుమతులు లేని బడుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఇటువంటి పాఠశాలలను, శిక్షణ కేంద్రాలను గుర్తించి ఎటువంటి నోటీసులు లేకుండానే మూసివేయాలని డీఈఓ ఆదేశించారు.