అక్షరటుడే, కామారెడ్డి: talent test | పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రతిభా పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. శనివారం సాందీపని జూనియర్ కళాశాలలో సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ అంజయ్య వారికి బహుమతులు అందజేశారు. ప్రైవేట్ పాఠశాల నుంచి మొదటి స్థానంలో అంచిత, రెండోస్థానంలో శ్రీకృప, మూడో స్థానంలో నవతేజ్, ఆహీల్ గోరి, నాలుగో స్థానంలో యుక్తారెడ్డి, ఋషికేష్, శ్రీ విభవ సంస్కృతి, ఐదో స్థానంలో కౌశిక్ యాదవ్, ప్రణవి నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి శృతి, స్పందన, సుస్మిత, శ్రావణి, గణేష్ నిలిచారు. కార్యక్రమంలో సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ బాలాజీ రావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నరసింహారావు, డాక్టర్ వేదప్రకాష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ రమేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రేణుక, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, నాయకులు రాహుల్, నితిన్, మణికంఠ, శ్రీకాంత్, నవీన్ పాల్గొన్నారు.
talent test | ప్రతిభా పరీక్ష విజేతలకు బహుమతుల ప్రదానం
Advertisement
Advertisement