అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar : నిజాంసాగర్ వెనుకబడిన తరగతుల వసతి గృహంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం వసతి గృహాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. తాగునీరు సరిగ్గా లేదని, బాత్రూంలు క్లీన్గా లేవన్నారు. హాస్టల్ భవనం పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి వార్డెన్ ఉండడంతో పర్యవేక్షణ కరువైందన్నారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు మెనూ ప్రకారంగా భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లోక సంతోష్, శ్రవణ్ కుమార్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ యాదవ్, నాగరాజు, గాజుల చంద్రశేఖర్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
Nizam sagar : హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి
Advertisement
Advertisement