అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్‌ నగరంలో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్‌పాల్‌, మేయర్‌ నీతూకిరణ్‌ ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మకరందు ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే సీపీ కార్యాలయంలో అదనపు డీసీపీల ఆధ్వర్యంలో, బాన్సువాడలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో, కామారెడ్డిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూరు ఫుడ్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, ఆర్మూర్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు.