Bhimgal | ఆస్తి పన్ను గ‌డువులోగా చెల్లించాలి

Bhimgal | ఆస్తి పన్ను గ‌డువులోగా చెల్లించాలి
Bhimgal | ఆస్తి పన్ను గ‌డువులోగా చెల్లించాలి
Advertisement

అక్షరటుడే, భీమ్‌గల్: Bhimgal | పట్టణ ప్రజలు ఆస్తి పన్ను బకాయి చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తున్న బృందాలను తనిఖీ చేశారు.

ఆస్తి పన్ను బకాయిదారులతో ఆయన మాట్లాడుతూ.. మార్చి 31లోపు అందరూ ఆస్తి పన్ను చెల్లించాలని సూచించారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ బకాయిల వసూళ్ల కోసం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆస్తి పన్ను చెల్లించ‌క‌పోతే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. 8వ వార్డులోని బాపూజీ నగర్‌లో తాగునీటి వాటర్ ట్యాంక్ దగ్గర మాన్యువల్ చెడిపోవడంతో కొత్త మాన్యువ‌ల్ అమ‌ర్చామ‌న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement