అక్షరటుడే, ఇందూరు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న మానవహారం చేపట్టనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రైవేటు పీజీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement