Advertisement

అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలోని మౌలగల్లి జామ మసీద్ దగ్గర ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజా నాయకుడు బజరంగ్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను అధికారులు కూల్చారన్నారు. కానీ కొత్త భవనం నిర్మించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠశాల పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో షేక్ నయీమ్, గౌస్, పబ్బ శేఖర్, ఫారుక్, ఇస్మాయిల్, ముజీబ్, లయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement