MLA Dhanpal | రఘునాథ ఆలయాభివృద్ధికి నిధులివ్వండి: ధన్​పాల్​

MLA Dhanpal | రఘునాథ ఆలయాభివృద్ధికి నిధులివ్వండి: ధన్​పాల్​
MLA Dhanpal | రఘునాథ ఆలయాభివృద్ధికి నిధులివ్వండి: ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు:MLA Dhanpal | జిల్లా కేంద్రంలోని పురాతన ఆలయాల్లో ఒకటైన రఘునాథ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) కోరారు. అసెంబ్లీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర కూటుల వంశానికి చెందిన ఇంద్రుడు క్రీ.శ. 914-928 మధ్యకాలంలో కోటను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. 450 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) గురువు సమర్థ రామదాసు(Samartha Ramadas) ఆలయ నిర్మాణం చేశారని చెప్పారు.

Advertisement
Advertisement

నిజాం కాలంలో కోటను కేంద్ర కర్మాగారంగా మార్చి దేవాలయంలో పూజలను కూడా నిషేధించారని చరిత్ర చెబుతుందన్నారు. తెలంగాణ విమోచన కోసం చేసిన పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యులుDasarathi Krishnamacharya, వట్టికోట అల్వార్ స్వామిVattikota Alwar Swami, తదితరులు ఎందరో ఖిల్లా జైల్లో బంధీలుగా ఉన్నారని తెలిపారు. దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ'(‘Naa Telangana koti ratanala veena’) అని ఇదే జైలులో రాశారన్నారు. ఎంతో చరిత్ర గల ఆలయం శిథిలావస్థకు చేరుకుంటుందని, స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | ఎల్​హెచ్​పీఎస్​ నాయకుల హర్షం