అక్షరటుడే, ఆర్మూర్:MLA Prashanth Reddy | ప్యాకేజీ 21 A పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి(MLA Vemula Prashanth Reddy) కోరారు. గురువారం అసెంబ్లీ(Assembly) సమావేశాల్లో భాగంగా జీరో అవర్(Zero Hour)లో బాల్కొండ నియోజకవర్గ ఇరిగేషన్ పనుల్లో జాప్యంపై ఆయన మాట్లాడారు.
MLA Prashanth Reddy | పనుల్లో వేగం పెంచాలి..
బాల్కొండ,నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మెట్పల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి ప్యాకేజీలు 20,21,21A నిర్దేశించబడ్డాయని ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) పేర్కొన్నారు. వాటికి రూ.4,800 కోట్లతో మొదలు పెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి చేసి సుమారు రూ. 3,300 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగతా పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
MLA Prashanth Reddy | బాల్కొండ నియోజకవర్గంలో..
ముఖ్యంగా ప్యాకేజీ 21 A మెట్పల్లి సెగ్మెంట్లో బాల్కొండ నియోజవర్గంలో భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు కలిపి 80వేల ఎకరాలు ఉందని ప్రశాంత్‌రెడ్డి(Prashanth Reddy) వివరించారు. నిజామాబాద్ రూరల్ జక్రాన్ పల్లి మండలంలో 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 ఎకరాలు సాగులో ఉందన్నారు. ప్యాకేజీ 21 A మెటపల్లి సెగ్మెంట్లో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని, హెడ్ వర్క్స్, పంప్‌హౌజ్‌లు, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్, మెయిన్ లైన్ పూర్తయ్యిందన్నారు. ఒక డిస్ట్రిబ్యూటరీ లైన్ వేయాల్సి ఉందన్నారు.
MLA Prashanth Reddy | ఆర్నెళ్లలోనే సాగునీరివ్వొచ్చు..
ప్యాకేజీ 21 A మిగతా 20 శాతం పనులు పూర్తి చేసినట్లయితే 6 నెలల్లోనే 1,20,000 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వివరించారు. 9,274 ఎకరాలకు సాగునీరు అందించే చిట్టాపూర్, సుర్బిర్యాల్, ఫత్తేపూర్ పనులు వేగవంతం చేయాలన్నారు. శ్రీరామ్ సాగర్(Sriram Sagar) నుంచి తీసుకోబడ్డ మరో లిఫ్ట్‌కు గత ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూర్, శ్రీరాంపూర్, బాల్కొండ గ్రామాలకు రూ.60 కోట్లతో 3,474 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఫతేపూర్, సుర్బిర్యాల్ గ్రామాలకు రూ.90 కోట్లతో 5,800 ఎకరాలకు ఈ లిఫ్ట్ ద్వారా సాగు నీరు అందించవచ్చన్నారు. ఈ పనులన్నింటినీ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.