అక్షరటుడే, కామారెడ్డి: విద్యారంగ, ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరించడంలో పీఆర్‌టీయూ ముందువరుసలో ఉంటుందని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో పీఆర్‌టీయూ ఆవిర్భావోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 150 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, స్వయన్వకర్త కుషాల్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.