అక్షరటుడే, ఇందూరు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2022 జూలై 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు వినియోగిస్తున్న ఈ కుబేర్ ను రద్దు చేయాలన్నారు. ట్రెజరీ నుంచి బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాయ, ఉద్యోగ నాయకులు పాల్గొన్నారు.