అక్షరటుడే ఇందూరు: ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే మొక్కుబడిగా ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం తగదని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ అసంతృప్తితో ఉందన్నారు. కనీసం మూడు డీఏలను తక్షణ విడుదల చేయాలన్నారు.