అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయుల పక్షాన పోరాడడంలో తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ అన్నారు. మంగళవారం సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హక్కుల పరిరక్షణ, విధుల నిర్వహణ, సామాజిక న్యాయం తదితర సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తమపాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతకుముందు సంఘం జెండాను ఆవిష్కరించారు. అలాగే భాషా పండితుడు ముత్తారం నరసింహస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వాసుదేవరావు, నాగేశ్వరరావు, గంగాధర్, జావీద్, రాము, కౌచిక దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.