అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ తెలంగాణ కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల పదోన్నతులు, బదిలీల్లో జరిగిన పొరపాట్లను పరిష్కరించాలన్నారు. ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి భర్తీ చేయాలన్నారు. కేజీబీవీ, నాన్ టీచింగ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వాసుదేవరావు, గంగాధర్, జావిద్, భూషణ్, సత్యనారాయణ, ప్రభాకర్ పాల్గొన్నారు.