పూలే విగ్రహ ఏర్పాటుకు సహకరించండి

0

అక్షరటుడే, ఇందూరు: అసెంబ్లీలో మహాత్మ జ్యోతి బాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారని, ఇందుకు సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ ను జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేను వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్, పులి జైపాల్, సాయికృష్ణ, సుకుమార్, కొయ్యాడ శంకర్ పాల్గొన్నారు.