తండాలో అగ్నిప్రమాదం.. మూడు గుడిసెలు దగ్ధం

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం ముంబోజిపేట తండాలో బుధవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం..గులాబ్ సింగ్ పశువుల కొట్టానికి బుధవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అనంతరం పక్కనే ఉన్న నివాస గుడిసెలకు మంటలు వ్యాపించాయి. మొత్తం మూడు గుడిసెల్లోని నిత్యావసర సరకులు, మొక్కజొన్న పంట, బంగారం, నగదు, దుస్తులు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరారు.