అక్షరటుడే, వెబ్ డెస్క్: భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని విధంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ‘పుష్ప2: ది రూల్ చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీలో రూ.72 కోట్లు, నార్త్ అమెరికాలో 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు చెప్పారు.
తొలిరోజు వసూళ్లలో ఇప్పటివరకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రూ.223.5 కోట్లతో మొదటి స్థానంలో ఉండేది. ‘పుష్ప-2’ ఆ రికార్డును తిరగరాసింది. ‘బాహుబలి-2’ రూ.214 కోట్లతో మూడో స్థానానికి పరిమిమైంది. ‘కల్కి-2898 ఏడీ'(182.6కోట్లు), సలార్(రూ.165 కోట్లు), కేజీయఫ్: ఛాప్టర్-2(రూ.162.9 కోట్లు), దేవర-1(145.2కోట్లు) లియో(రూ.142.8 కోట్లు) ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), జవాన్(రూ.129.2 కోట్లు) టాప్-10లో ఉండగా.. తొలి అయిదు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉండటం సంతోషించదగ్గ విషయం.